ప్రభుత్వంపై మేం చేస్తున్న పోరాటానికి క్లైమాక్స్‌ పాదయాత్ర. ప్రజాస్వామ్యం ఉందా? లేదా? అన్నట్లు అసెంబ్లీ పనితీరు ఉంది. 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువులు కొన్నట్లు కొన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అసెంబ్లీలో ఎలాంటి చర్యలు లేవు. అది కాకుండా ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో నలుగురిని మంత్రులుగా కూడా చేశారు. ఫిరాయింపుల వ్యవహారాన్ని ప్రజల ముందుకు మరింత బలంగా తీసుకెళ్లేందుకే అసెంబ్లీని బహిష్కరించాం. అసెంబ్లీకి వెళ్లకపోయినా.. ప్రభుత్వ అరాచకాలను ప్రజలకు వివరించి చెప్పాం.


2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు మోదీతో కలిసి ప్రచారం చేశారు. జగన్‌కు ఓటేస్తే కాంగ్రెస్‌కు ఓటేసినట్లేనని ప్రచారంలో చెప్పారు. గత ఐదేళ్లలో మేం ఎక్కడా కాంగ్రెస్‌తో కలిసింది లేదు. చంద్రబాబు మాత్రం నాలుగన్నరేళ్లు బీజేపీతో సంసారం చేశారు. నాలుగేళ్లపాటు బీజేపీ కేంద్రంలో పెట్టిన బడ్జెట్‌ను సైతం పొగిడారు. ఎన్నికలు సమీపిస్తున్నాయన్న తరుణంలో మళ్లీ చంద్రబాబు మాట మార్చారు. ఇప్పుడు బీజేపీని తిడుతూ.. మళ్లీ కాంగ్రెస్‌ పార్టీతో జోడి కట్టారు. గతంలో బీజేపీ, పవన్‌ కల్యాణ్‌తో కలిసి కాపురం చేసిన చంద్రబాబు.. ఇప్పుడు కాంగ్రెస్‌తో కాపురం చేస్తున్నారు. రెండు పార్టీలతో జతకట్టిన చంద్రబాబు.. వాళ్లతో కలిశారు.. వీళ్లతో కలుస్తారు అని మా పై విమర్శలు చేస్తున్నారు
ఏపీలో ఎక్కడా అభివృద్ధి జరగడం లేదు. పోలవరం ప్రాజెక్ట్‌ పునాదులు దాటలేదు. చంద్రబాబు విడుదల చేస్తున్న శ్వేతప్రతాలు ఒక బూటకం. ఏపీలో పాలన ఎంత దారుణంగా ఉందో అందరికీ తెలుసు. రైతు రుణమాఫీని సమర్ధించను అని ఎప్పుడు చెప్పను. రుణమాఫీ సాధ్యాసాధ్యాల గురించే నేను మాట్లాడాను. కేంద్ర ప్రభుత్వం రుణమాఫీ చేస్తానంటే.. ముందుగా సంతోషించేది నేనే. నేను ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే.. పదవికి రాజీనామా చేసి వెళ్లిపోతా. పాదయాత్ర మొదలు పెట్టక ముందే.. రైతు భరోసా గురించి చెప్పాను. ప్రతి రైతు కుటుంబానికి మే నెలలో రూ.12,500 ఇస్తాం. నాలుగు దఫాలుగా రూ.50 వేలు చొప్పున ఇస్తాం. మన రాష్ట్రంలో చిన్న కమతాలు ఉన్న రైతులే ఎక్కువ. అందుకే రైతు భరోసా రైతు కుటుంబాన్ని ఒక యునిట్‌గా తీసుకున్నాం. రైతుల దగ్గర తక్కువ ధరకు కొని.. చంద్రబాబు తన హెరిటేజ్‌ ద్వారా ఎక్కువ ధరలకు అమ్ముతున్నారు. నాలుగేళ్లు కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి అన్యాయం జరిగినా.. చంద్రబాబు పొగుడుతూ వచ్చారు. చంద్రబాబు అవినీతి చేస్తున్నా.. మన భాగస్వామియే కదా అని మోదీ వదిలేశారు.’ అని వైఎస్‌ జగన్‌ చెప్పుకొచ్చారు. చంద్రబాబుకు ఓటేయమని పవన్‌ కల్యాణ్‌ ఊరూరు తిరిగి ప్రచారం చేశారు. ఏపీకి జరిగిన అన్యాయంలో చంద్రబాబు, బీజేపీ, పవన్‌ ముగ్గురికి పాత్ర ఉంది. మేం గతంలో ఎవరితోను పొత్తు పెట్టుకోలేదు.. ఈ సారి కూడా ఎవరితోను పొత్తు పెట్టుకోము. మాకు ప్రజల మీద, దేవుడి మీద నమ్మకం ఉంది

Advertisement

0 comments :

Post a Comment

Trending on this Site now

 
Top